‘నేతన్న సేవలో’

‘నేతన్న సేవలో’

చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2026, ఆగస్టు 7న ‘నేతన్న సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. వయసు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకుని సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏడాదికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 71,536 మంది నేత కార్మికుల కుటుంబాల ఖాతాల్లో రూ.179 కోట్లు జమ చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram