ఆస్ట్రేలియా సహాయమంత్రి జూలియన్ హిల్ నాయకత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో 2026, ఆగస్టు 2న సమావేశమైంది.
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి లాంటి రంగాల్లో నాలుగు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) బృందం కుదుర్చుకుంది.