జీఎంఆర్ సంస్థ పీపీపీ విధానంలో నిర్మించిన భోగాపురానికి విమానాశ్రయానికి ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేస్తున్నట్లు పౌరవిమానయానశాఖ 2026, జులై 28న గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని 2024 సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పుడు కేంద్రం దాన్ని అధికారికంగా గుర్తిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.