మనీ మ్యూల్‌ ఖాతాలకు కొత్త నిబంధనలు

మనీ మ్యూల్‌ ఖాతాలకు కొత్త నిబంధనలు
  • సైబర్‌ ఆధారిత ఆర్థిక నేరాలు, అక్రమ లావాదేవీలకు ఉపయోగించే మనీ మ్యూల్‌ ఖాతాల నియంత్రణకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త నిబంధనలను సిద్ధం చేసింది. సైబర్‌ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును బదిలీ చేసేందుకు వాడే అనుమానాస్పద ఖాతాలపై బ్యాంకులు విధించే తాత్కాలిక డెబిట్‌ హోల్డ్‌కు గరిష్ఠంగా 60 రోజుల గడువును ప్రతిపాదించింది.

  • బ్యాంకులు, ప్రజల నుంచి అక్టోబరు 2 వరకూ సూచనలు, అభిప్రాయాలను ఆహ్వానించింది. వీటన్నింటి పరిశీలన అనంతరం తుది మార్గదర్శకాలను 2027 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తెస్తారు. కావాలనుకుంటే బ్యాంకులు ముందుగానే అమలు చేయవచ్చు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram