ప్రస్తుతం దేశంలో 17,600 కోట్ల కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము తెలిపారు. ప్రపంచంలో అత్యధికంగా వినియోగంలో ఉండే కరెన్సీల్లో అమెరికా డాలర్, ఐరోపా దేశాల యూరో ముందు స్థానాల్లో ఉంటాయి. అయితే నోట్ల సంఖ్యా పరంగా చూస్తే, వీటి కంటే దేశీయ కరెన్సీ అయిన రూపాయి (వివిధ విలువలు కలిగినవి రూ. 1, 5, 10, 20, 50, 100, 200, 500) నోట్లే ఎక్కువని ముర్ము వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా చెలామణిలో ఉన్న డాలర్ నోట్లు 5,600 కోట్ల కంటే ఇవి 3 రెట్లు ఎక్కువ. యూరో నోట్ల సంఖ్య 3000 కోట్లు కాగా, వీటితో పోలిస్తే 6 రెట్లు అధికం.