అధునాతన మధ్య స్థాయి యుద్ధ విమానాల (ఏఎమ్‌సీఏ) కోసం దేశీయంగా ఇంజిన్ అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), రోల్స్ రాయిస్ సంయుక్తంగా ప్రకటించాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ కంపెనీ అయిన ఆర్‌ఐఎల్, బ్రిటన్‌కు చెందిన విమాన ఇంజిన్ల తయారీ దిగ్గజ సంస్థ రోల్స్‌రాయిస్ సంయుక్తంగా భారత్‌లో యుద్ధ విమానాల ప్రొపెల్షన్ సామర్థ్యాన్ని నిర్మించనున్నాయి.