కుటుంబాలపై తలసరి రుణ భారం

కుటుంబాలపై తలసరి రుణ భారం

28.3 కోట్ల కుటుంబాలపై తలసరి రుణ భారం రూ.4.77 లక్షలు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి లోక్‌సభలో 2026, ఆగస్టు 10న వెల్లడించారు. 2018 మార్చి నాటికి 12.8 కోట్ల కుటుంబాలు బ్యాంకులకు రూ.43,61,013 కోట్ల మేర బకాయి ఉన్నాయి. 2025 మార్చి నాటికి బకాయిపడిన కుటుంబాల సంఖ్య 28.3 కోట్లకు చేరింది. అవి తీసుకున్న రుణాల మొత్తం రూ.1,35,09,017 కోట్లకు పెరిగింది. కొత్తగా అప్పులు చేసిన కుటుంబాలు 121%మేర, అవి తీసుకున్న రుణాల మొత్తం 209%మేర వృద్ధి చెందాయి. దీంతో తలసరి రుణ భారం 39.85%మేర అధికమైంది. వీటిలో సింహభాగం వ్యక్తిగత రుణాలదే. ఆ తర్వాతి స్థానాల్లో గృహ, వాహన, బంగారం, విద్యా రుణాలున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram