రూ.లక్ష కోట్ల లారస్‌ ల్యాబ్స్‌

రూ.లక్ష కోట్ల లారస్‌ ల్యాబ్స్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఔషధ కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్, రూ.లక్ష కోట్ల మార్కెట్‌ విలువ ఉన్న కంపెనీల జాబితాలో స్థానం సంపాదించింది. లారస్‌ ల్యాబ్స్‌ షేరు 2026, ఆగస్టు 5న బీఎస్‌ఈలో గరిష్ఠంగా రూ.1858.95 ధర పలికింది. దీని ప్రకారం రూ.1,00,429 కోట్ల మార్కెట్‌ విలువ సాధించింది. స్థానిక ఫార్మా కంపెనీల్లో అగ్రగామిగా ఉన్న దివీస్‌ లేబొరేటరీస్‌ ఇటీవలే రూ.2 లక్షల కోట్ల మార్కెట్‌విలువను అధిగమించింది. డాక్టర్‌ రెడ్డీస్, అరబిందో ఫార్మా, కొన్ని ఇతర ఫార్మా కంపెనీలు ఇంకా రూ.1 లక్ష కోట్ల మార్కెట్‌ విలువను అందుకోలేదు. ఔషధ రంగంలోని అన్ని విభాగాలకు విస్తరించడమే లారస్‌ మార్కెట్‌ విలువ ఇంతలా పెరగడానికి కారణం.

  • లారస్‌ ల్యాబ్స్‌ సంస్థ ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌), ఎఫ్‌డీఎఫ్‌ (ఫినిష్డ్‌ డోసేజ్‌) ఔషధాలను అందించడంతో పాటు సీడీఎంఓ, బయోటెక్నాలజీ విభాగాల్లో అధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram