దేశంలో కుటుంబాల పొదుపు ఏటా పెరుగుతూ వస్తోంది. 2022-23లో జీడీపీలో దీని వాటా 20% కాగా, 2024-25 కల్లా 21.7 శాతానికి పెరిగింది. జీడీపీ కొత్త సిరీస్ ప్రకారం, 2022-23లో కుటుంబాల పొదుపు రూ.52.25 లక్షల కోట్లుగా ఉండగా, 2024-25 కల్లా రూ.69.01 లక్షల కోట్లకు చేరిందని రాజ్యసభకు రాతపూర్వకంగా ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌధ్రీ తెలిపారు.