యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా చేసే లావాదేవీల విలువ 2026, జులైలో రూ.29.88 లక్షల కోట్లకు చేరినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. 2026 మేలో రికార్డు స్థాయిలో నమోదైన రూ.29.9 లక్షల కోట్ల స్థాయికి మళ్లీ చేరాయి.
యూపీఐ లావాదేవీలు సంఖ్యాపరంగా జులైలో 2,366 కోట్లకు చేరాయి. మేలో నమోదైన 2,320 కోట్లు, జూన్‌లో నమోదైన 2,272 కోట్ల కంటే ఇవి ఎక్కువ.