రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద 880.52 టన్నుల బంగారు నిల్వలున్నాయి. 2025 మార్చి 31తో పోలిస్తే, 2026 మార్చి 31 నాటికి 0.94 టన్నుల పసిడి నిల్వలే పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధ్రీ 2026, జులై 28న రాజ్యసభకు తెలిపారు. గత రెండేళ్లతో పోలిస్తే ఇదే కనిష్ఠ వృద్ధి అని తెలిపారు.