జ్వెరెవ్‌దే యుఎస్‌ ఓపెన్‌

జ్వెరెవ్‌దే యుఎస్‌ ఓపెన్‌

యుఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ విజేతగా టాప్‌ సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) నిలిచాడు. ఫైనల్లో అతడు 6-3, 7-6 (7-2), 5-7, 6-2తో ఎనిమిదో సీడ్‌ షెల్టన్‌ (అమెరికా)పై విజయం సాధించాడు. జ్వెరెవ్‌ ఫైనల్లో 9 ఏస్‌లు, 35 విన్నర్లు కొట్టాడు. నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేశాడు. 2026లో అతడు గెలిచిన రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ఇది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ కూడా కైవసం చేసుకున్నాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram