ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌

భారత్‌లో తొలిసారిగా జరిగిన అంతర్జాతీయ పారా ఆర్చరీ సిరీస్‌ ఈవెంట్‌ 2026, సెప్టెంబరు 9న ముగిశాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న సబర్మతీ రివర్‌ఫ్రంట్‌ వేదికగా సెప్టెంబరు 5న ఈ టోర్నమెంట్‌ స్టేజ్‌-3 ప్రారంభమయ్యాయి. ఇందులో రికర్వ్‌ ఓపెన్, కాంపౌండ్‌ ఓపెన్, డబ్ల్యూ1, దృష్టిలోపం ఉన్న వారి విభాగాల్లో పోటీలు జరిగాయి. 19 దేశాల నుంచి వందమందికి పైగా ఆర్చర్లు టోర్నీలో పోటీపడ్డారు.

  • చివరి రోజున (సెప్టెంబరు 9) భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలతో పాటు నాలుగు కాంస్యాలు చేరాయి. కాంపౌండ్‌ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ శీతల్‌ దేవి పసిడి నెగ్గింది. ఫైనల్లో ఆమె కజకిస్థాన్‌ ఆర్చర్‌ ఐజాదా సీడన్‌పై విజయం సాధించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram