జాతీయ క్రీడా పాలన చట్టం (ఎన్‌ఎస్‌జీఏ)కు అనుగుణంగా తన రాజ్యాంగంలో కొన్ని మార్పులకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆమోదం తెలిపింది. ఐఓఏ ఆఫీసు బేరర్లు ఎక్కువకాలం పదవుల్లో కొనసాగేందుకు ఈ మార్పులు వీలు కల్పిస్తాయి. ఇంతకుముందు రాజ్యాంగం ప్రకారం.. 70 ఏళ్లు నిండిన వాళ్లెవరూ ఐఓఏలో పదవులకు అర్హులు కారు. కానీ తాజా మార్పులు వల్ల 70 నుంచి 75 ఏళ్ల మధ్య వారు కూడా పోటీ చేయొచ్చు.