సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి జంట తమ కెరీర్లో తొలిసారిగా చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ సూపర్ 750 టైటిల్‌ను చేజిక్కించుకుంది. 2026, సెప్టెంబరు 6న షెంజెన్‌లో జరిగిన ఫైనల్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో చైనాకు చెందిన ప్రపంచ మాజీ నంబర్ 4 జంట హె జి టింగ్, రెన్ జియాంగ్ యులపై విజయం సాధించింది. ఈ సీజన్లో ఈ జోడీకిది రెండో టైటిల్. 2026, మేలో సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను గెలుచుకుంది.