భారత్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ 2026, ఆగస్టు 23న ముగిసింది. దిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ టోర్నీ జరిగింది. ఫ్రాన్స్ తరఫున తొలిసారి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచిన ప్లేయర్లుగా తామ్ గిక్వెల్, డెల్‌ఫైన్ డెల్‌రూ జోడీ చరిత్ర సృష్టించగా.. అలెక్స్ లానియెర్ పురుషుల సింగిల్స్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. గత ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ టోర్నీలో గిక్వెల్, డెల్‌రూ జంట కాంస్యం నెగ్గింది.
ఈ పోటీల్లో భారత్‌కు చెందిన పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జోడీ మహిళల డబుల్స్‌లో కాంస్యం సాధించింది.