ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ జోడీ కాంస్యం నెగ్గింది. 2026, ఆగస్టు 22న దిల్లీలో జరిగిన సెమీఫైనల్లో పోరాడి ఓడింది. హోరాహోరీగా సాగిన పోరులో అన్‌సీడెడ్ గాయత్రి, ట్రీసా ద్వయం 21-18, 13-21, 8-21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ షెంగ్ షు, టాన్ నింగ్ (చైనా) జోడీ చేతిలో పరాజయం పొందింది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ మహిళల డబుల్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ఘనత గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలదే.