హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో 6384 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లోనూ ఆమె రెండో ర్యాంకులో కొనసాగుతోంది. 2026, జులై నెలాఖర్లో ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో ఇషా 25 మీటర్ల పిస్టల్ పోటీలో స్వర్ణం చేజిక్కించుకుంది.