ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్‌లో బసంత్ కుమార్ మేఘ్వాల్ (19 ఏళ్లు) హైజంప్‌లో రజతం చేజిక్కించుకుని, ఈ టోర్నీలో ఈ విభాగంలో పతకం గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. 2026, ఆగస్టు 9న యూజీన్ (అమెరికా)లో జరిగిన ఫైనల్లో బసంత్ ఉత్తమంగా 2.21 మీటర్ల ఎత్తు దూకి, రెండో స్థానంలో నిలిచాడు. యూన్స్ అయాచి (అల్జీరియా), ఓటిస్ పూల్ (బ్రిటన్) వరుసగా స్వర్ణం, కంచు పతకాలు నెగ్గారు.