భారత యువ అథ్లెట్ ఆశిష్ యాదవ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గాడు. 2026, ఆగస్టు 8న యూజీన్ (అమెరికా)లో జరిగిన పురుషుల జావెలిన్ ఫైనల్లో ఆశిష్ ఉత్తమంగా 74.09 మీటర్ల త్రోతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. జాన్ హెండ్రిక్ హేమాన్స్ (దక్షిణాఫ్రికా, 80.50 మీటర్లు) స్వర్ణం, అడిసన్ జేమ్స్ (డొమినికా, 73.89 మీటర్లు) కాంస్యం గెలుచుకున్నారు