ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగులో మహ్మద్ అష్ఫాక్ జాతీయ రికార్డు నెలకొల్పాడు. యూజీన్ (అమెరికా)లో జరిగిన హీట్‌లో 45.81 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (46.05 సెకన్లు)ను అధిగమించాడు.