భారత యువ షట్లర్ తన్వి శర్మ కెరీర్లో తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. 2026, ఆగస్టు 2న తైపీ సిటీలో జరిగిన తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో తన్వి మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆమె 21-16, 21-16తో ఆరో సీడ్ లిన్ గుయెన్ (వియత్నాం)పై గెలిచింది.