కామన్వెల్త్ క్రీడల్లో మొదటిసారి భారత జూడో క్రీడాకారులు రెండు స్వర్ణాలు నెగ్గారు. 2026, జులై 31న మహిళల 48 కేజీల విభాగంలో అస్మిత డే విజేతగా నిలిచి దేశానికి జూడోలో తొలి స్వర్ణాన్ని అందించింది. గ్లాస్గోలో జరిగిన ఫైనల్లో త్రిపురకు చెందిన అస్మిత కెనడా క్రీడాకారిణి హైది కువాచ్‌ను ఓడించింది.
మరోవైపు పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్.. జాషువా కట్జ్ (ఆస్ట్రేలియా)ను ఓడించి పసిడి దక్కించుకున్నాడు.