కామన్వెల్త్ క్రీడల అథ్లెటిక్స్‌లో గుల్వీర్ సింగ్ రికార్డు విజయం నమోదు చేశాడు. 2026, జులై 29న గ్లాస్గోలో జరిగిన పురుషుల 10 వేల మీటర్ల పోటీలో అతడు 27 నిమిషాల 49.78 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రజతం సాధించాడు. ఈ ఈవెంట్లో కామన్వెల్త్ పతకం అందుకున్న తొలి భారతీయుడిగా గుల్వీర్ ఘనత అందుకున్నాడు. ఆస్ట్రేలియా రన్నర్ కై రాబిన్‌సన్ (27:48.93) స్వర్ణం దక్కించుకోగా.. డేవిడ్ ముల్లార్‌కే (27:50.28) కాంస్యం నెగ్గాడు.