కామన్వెల్త్ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ బాబు రజతం నెగ్గాడు. 2026, జులై 28న గ్లాస్గోలో జరిగిన పురుషుల 79 కిలోల విభాగంలో అతడు మొత్తం 330 కిలోలతో రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 149 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కిలోలు ఎత్తేశాడు. హిదాయత్ (331 కిలోలు)కు స్వర్ణం సొంతం చేసుకోగా ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్ ముర్రే (325) కాంస్య పతకం గెలుచుకున్నాడు.
మరోవైపు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత తొలి పారా అథ్లెట్‌గా షర్మిల ధన్‌ఖడ్ ఘనత సాధించింది. మహిళల షాట్‌పుట్ (ఎఫ్57)లో ఆమె విజేతగా నిలిచింది.