మణిపుర్‌ సీఎంగా ఖేమ్‌చంద్‌ ప్రమాణం

మణిపుర్‌ సీఎంగా ఖేమ్‌చంద్‌ ప్రమాణం
  • మణిపుర్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భాజపా నేత యుమ్నమ్‌ ఖేమ్‌చంద్‌ సింగ్‌ (62) 2026, ఫిబ్రవరి 4న ప్రమాణం చేశారు. గవర్నర్‌ అజయ్‌కుమార్‌ భల్లా ఆయనతో ప్రమాణం చేయించారు. కుకీ సామాజిక వర్గానికి చెందిన నెమ్చా కిప్‌గెన్‌ (భాజపా), నాగా సామాజిక వర్గానికి చెందిన నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) శాసనసభ్యుడు ఎల్‌ డిఖో ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యారు.
  • జాతుల మధ్య ఘర్షణలతో 2023 మే 3 నుంచి మణిపుర్‌ అతలాకుతలమైంది. ఈ ఘర్షణల్లో దాదాపు 260మంది మృత్యువాతపడ్డారు. తర్వాతి పరిణామాల నేపథ్యంలో 2025, ఫిబ్రవరి 9న అప్పటి సీఎం బీరెన్‌సింగ్‌ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 13 నుంచి మణిపుర్‌ రాష్ట్రపతి పాలనలో ఉంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram