దేశంలో వైద్యులపై దాడులు, బెదిరింపులు, నిరాధార వేధింపుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వారి రక్షణ కోసం ఔషధ సంస్థ ఓజోన్ ఫార్మాస్యూటికల్స్, ఓజోన్ షీల్డ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. వైద్యవృత్తిలో ఉన్నవారికి సమగ్ర భద్రత, న్యాయ సహాయం, సంక్షేమం అందించే ఈ వ్యవస్థను పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ దిల్లీలో ఆవిష్కరించారు.