నాలుగేళ్ల కిందట (2022) కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చీతా ప్రాజెక్టు అనేక సవాళ్లను అధిగమించి విజయవంతమైంది. ప్రస్తుతం వాటి సంఖ్య 52కు చేరుకుంది. వీటిలో 32 భారత్‌లోనే జన్మించాయి. 2022 సెప్టెంబరు 17వ తేదీన నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలను ప్రధాని మోదీ.. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో వదిలారు.