కేంద్ర సెన్సార్‌ బోర్డు ఏర్పాటు

కేంద్ర సెన్సార్‌ బోర్డు ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వం 18 మందితో కొత్త సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సెన్సార్‌ బోర్డు)ను ఏర్పాటుచేసింది. ఈ బోర్డు మూడేళ్లపాటు కొనసాగనుంది. ఇందులో నిర్మాత సుప్రియ యార్లగడ్డ, దర్శకుడు ప్రియదర్శన్, బాలీవుడ్‌ నటులు సునీల్‌శెట్టి, ప్రీతీజింటా, పంకజ్‌త్రిపాఠి, మనోజ్‌జోషి, కశ్మీర్‌ఫైల్స్‌ నటీమణి పల్లవి జోషి, నటి, రాజ్యసభ మాజీ సభ్యురాలు రూపాగంగూలీ, రచయిత, విమర్శకులు వినోద్‌ అనుపమ్, సంగీతదర్శకులు రికీ కేజ్, గాయకులు, మాజీ ఎంపీ హంస్‌రాజ్‌ హంస్, పాత్రికేయుడు యతీంద్రమిశ్ర, రచయిత అభిషేక్‌ జైన్, ఒడిశాకు చెందిన దర్శకుడు, నిర్మాత నీలా మాధబ్‌ పాండా, బెంగాల్‌ ప్రముఖ నటుడు, నిర్మాత ప్రొసేన్‌జీత్‌ ఛటర్జీ, మరాఠీ నటి నిషిగంధా వాద్, నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా మాజీ డైరెక్టర్‌ వామన్‌ కేంద్రే, మహారాష్ట్రకు చెందిన రచయిత, సంపాదకుడు, సామాజిక కార్యకర్త రమేశ్‌రఘునాథ్‌ పతంగేలు సభ్యులుగా నియమితులయ్యారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram