ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నెలవారీ గరిష్ఠ వేతన పరిమితిని రూ.25వేలకు పెంచుతూ కేంద్ర మంత్రి మండలి 2026, సెప్టెంబరు 16న కీలక నిర్ణయం తీసుకుంది. గత పన్నెండేళ్లుగా ఈ పరిమితి రూ.15వేలుగా ఉంది. తాజా నిర్ణయం వల్ల 51 లక్షల మంది వేతన జీవులు ఈపీఎఫ్‌వో కవరేజీ పరిధిలోకి అదనంగా రానున్నారు. ఇప్పటికే ఉన్న సభ్యుల పీఎఫ్ పొదుపు, పింఛను మొత్తాలు పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతి రోజు నుంచే అమల్లోకి వస్తుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల నెలవారీ వేతనం రూ.25వేల వరకూ ఉన్నవారు కూడా ఈపీఎఫ్‌వో పరిధిలోకి వస్తారు.