4 ఆధ్యాత్మిక సంస్థలతో కేంద్రం ఒప్పందం

4 ఆధ్యాత్మిక సంస్థలతో కేంద్రం ఒప్పందం

దేశ యువతకు మత్తుపదార్థాల పీడ నుంచి విముక్తి ప్రసాదించేందుకు ఉద్దేశించిన ‘‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌’’ అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు ఆధ్యాత్మిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆధ్యాత్మ్‌ సత్సంగ్‌ కేంద్ర, చిన్మయ మిషన్, దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్, హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సంస్థలతో కుదుర్చుకున్న ఈ ఒప్పందంపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక శాఖ సంతకం చేసింది. ఆ శాఖ కార్యదర్శి సుదర్శన్‌ పంత్‌ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయం, సాధికారికత శాఖ తరఫున మాదక ద్రవ్యాల నివారణ సంస్థ డైరెక్టర్‌ ఆస్తిక్‌ కుమార్‌ పాండే ఒప్పందంపై సంతకం చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram