కేంద్ర పర్యావరణ, అటవీశాఖ 2026, సెప్టెంబరు 7న దిల్లీలోని పర్యావరణభవన్‌లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026 అవార్డులు ప్రదానం చేసింది. దేశవ్యాప్తంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఉన్న 130 నగరాల్లోని వాయు నాణ్యత ప్రమాణాలపై సర్వే ఆధారంగా 10 లక్షలకుపైగా జనాభా ఉన్న 48 నగరాలు, 3-10 లక్షలలోపు జనాభా ఉన్న 42 నగరాలు, 3 లక్షలలోపు జనాభా ఉన్న 40 పట్టణాలకు ర్యాంకులు ప్రకటించారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూ దేశంలో స్వచ్ఛమైన గాలి కలిగిన నగరాల జాబితాలో అత్యున్నత స్థానం కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇందౌర్ రెండో స్థానాన్ని జబల్‌పుర్ మూడో స్థానాన్ని పొందాయి.