దక్షిణ భారత్‌లో అడుగున ఉన్న కేరళ రాష్ట్ర పేరును ఇకపై ‘కేరళం’గా మారుస్తూ.. కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేరళ (పేరుమార్పు) చట్టం 2026 ద్వారా లభించిన అధికారాలను వినియోగించుకుంటూ.. ఈ చట్టంలోని నిబంధనలు అమలులోకి వచ్చే తేదీగా 2026 ఆగస్టు 25 ను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కేరళను కేరళంగా మార్చే బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల ఆమోదం తెలపడంతో అది చట్టరూపం దాల్చింది.