ఎల్‌పీజీ పైప్‌లైన్‌లు

ఎల్‌పీజీ పైప్‌లైన్‌లు

దేశంలో ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్రం కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ విస్తరణకు ఆమోదం తెలిపింది. రూ.7,000 కోట్లతో సుమారు 1,800 కిలోమీటర్ల మేర 3 కొత్త పైప్‌లైన్‌లను నిర్మించనున్నారు. ఇందుకు పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) ఆమోదం తెలిపింది. గెయిల్‌ ఇండియా ఈ పైప్‌లైన్‌ల నిర్మాణ బాధ్యతలను చేపట్టనుంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాల మీదుగా ఈ ప్రాజెక్టులను కేంద్రం నిర్మించనుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram