భారత జపాన్‌లు ద్వైపాక్షిక నౌకాయాన భద్రతను బలోపేతం చేసే ఒప్పందంపై 2026, ఆగస్టు 20న సంతకాలు చేశాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా బెదిరింపులకు పాల్పడుతున్నందున ద్వైపాక్షిక సైనిక సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరుపక్షాలూ నిర్ణయించాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో నౌకాయాన స్వేచ్ఛకు, నౌకల భద్రతకు ముప్పుగా పరిణమించే ఎలాంటిచర్యనైనా కలిసి ప్రతిఘటిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజూమీలు స్పష్టం చేశారు.