అణు రియాక్టర్లకు సంబంధించి ‘సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ’ (శాంతి) చట్టం-2025 ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అణు ప్రమాదాలు జరిగిన సమయంలో పరిహారం కోసం రియాక్టర్ల నిర్వాహకులు బీమా విధానం, ఆర్థిక భద్రత లేదా రెండింటి మిశ్రమాన్ని కొనసాగించాలని పేర్కొంది. వాడేసిన ఇంధనాన్ని (స్పెంట్ ఫ్యూయెల్) స్టోరేజ్ పూల్ నుంచి పూర్తిగా తొలగించే వరకూ ఆర్థిక భద్రత కొనసాగాలని స్పష్టంచేసింది.