విద్యుత్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎమ్ ఇ-డ్రైవ్ పథకాన్ని ద్విచక్ర వాహనాలకు పొడిగించారు. 2028 మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ విభాగానికి ఇంతకుముందు కిలోవాట్ అవర్‌కు రూ.5,000 సబ్సిడీ ఇవ్వగా, దీన్ని రూ.2,500కు తగ్గించారు. ఇది కూడా వాహనానికి గరిష్ఠంగా రూ.5000 వరకే పరిమితి ఉంటుంది.