అణ్వస్త్ర సామర్థ్యమున్న మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను భారత్ 2026, ఆగస్టు 6న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం జరిగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సైన్యంలోని వ్యూహాత్మక దళాల విభాగం ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలిపింది.
అగ్ని-4 క్షిపణి.. 4వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. వెయ్యి కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు.