ఎంపిక చేసిన డిజిటల్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఛార్జీ విధించేందుకు బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించే సవరణ బిల్లుకు లోక్‌సభ 2026, ఆగస్టు 6న ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశ పెట్టిన ‘పన్నులు, ఇతర చట్టాలు (సవరణ) బిల్లు, 2026’లో భాగంగా.. ‘చెల్లింపులు, సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007’తోపాటు ‘ఆదాయపు పన్ను చట్టం-2025’, ‘ఆర్థిక చట్టం-2026’లను ప్రభుత్వం సవరించింది.