దేశంలోని ప్రతి రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనూ ఇద్దరు మహిళలను సభ్యులుగా నియమించాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇలా నియమించే మహిళా సభ్యులు హైకోర్టు జడ్జీలుగా పనిచేసి రిటైరైన వారు కానీ, సీనియర్ న్యాయవాదులు కానీ అయి ఉండాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహన ధర్మాసనం స్పష్టం చేసింది.