సకాలంలో జనన-మరణాల నమోదు కోసం ఉద్దేశించిన ‘జననాలు, మరణాల నమోదు (సవరణ) బిల్లు 2026’ను పార్లమెంటు ఆమోదించింది. లోక్‌సభలో 2026, జులై 31న ఆమోదం పొందిన బిల్లు ఆగస్టు 4న రాజ్యసభలోనూ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. జనన-మరణాల నమోదు బిల్లు చట్టమైన తర్వాత.. చావు-పుట్టుకలను అవి జరిగిన రెండేళ్లలోపు నమోదు చేయించకపోతే ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేటు నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే.