వివాహిత మహిళలకు భర్త, అతని కుటుంబీకుల క్రూర ప్రవర్తన నుంచి రక్షణ కల్పించే ఐపీసీ 498ఏ పరిధిని సుప్రీంకోర్టు 2026, ఆగస్టు 3న విస్తరించింది. సహజీవన భాగస్వాములకూ ఈ సెక్షన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో భార్యాభర్తల్లా ఒక జంట సహజీవనం సాగిస్తుంటే ఆ అనుబంధంలోని మహిళను వేధింపులకు గురిచేసే పురుషుడిపై ఈ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం పేర్కొంది.