సముద్రగర్భంలో ఉన్న చమురు నిల్వలను వెలికితీసేందుకు, రూ.84,084 కోట్ల అంచనా వ్యయంతో ‘సముద్ర మంథన్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ పథకాని’కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో అత్యంత లోతున ఉన్న ప్రమాదకర ప్రాంతాల నుంచి చమురు, గ్యాస్ వెలికి తీసేందుకు తవ్వే బావులకు అయ్యే ఖర్చులో సగాన్ని లేదా గరిష్ఠంగా రూ.650 కోట్లను నేరుగా దేశ బడ్జెట్ ద్వారా ప్రభుత్వమే భరించనుంది.
వచ్చే 5 ఏళ్లలో (2031 వరకు) సముద్ర గర్భంలో దాదాపు 60 లోతైన, అతి లోతైన బావులు తవ్వడానికి రూ.43,200 కోట్లు కేటాయించారు.