భారత్‌లోనే రైల్వే ఛార్జీలు తక్కువ

భారత్‌లోనే రైల్వే ఛార్జీలు తక్కువ

ఇరుగు పొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లోనే రైల్వే ఛార్జీలు తక్కువగా ఉన్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 2026, జులై 29న లోక్‌సభలో పేర్కొన్నారు. వందే భారత్‌ రైళ్ల ఛార్జీలపై ఆయన మాట్లాడారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభించిన వందే భారత్‌ రైళ్లు ఇప్పుడు 82 మార్గాల్లో నడుస్తున్నాయి. 164 రైళ్లు ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఇందులో ఆధునిక సస్పెన్షన్‌ సిస్టం, సెమీ హైస్పీడ్, ఆటోమేటిక్‌ డోర్లు, ఆధునిక సీట్లు, మినీ పాంట్రీ, సీసీటీవీలు, కవచ్‌ సౌకర్యం ఉంటాయి. ఈ రైళ్లను అందరికీ అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో 300 కి.మీ. నుంచి 400 కి.మీ.వరకు నడిచే ఏసీ ఛైర్‌కార్‌ ఛార్జీలను కిలోమీటరుకు దాదాపు రూ.2.19గా నిర్ధారించినట్లు తెలిపారు. అదే చైనా, జపాన్, ఫ్రాన్స్‌లలో కిలోమీటరుకు ఛార్జీ రూ.7 నుంచి రూ.20దాకా ఉంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram