ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడినవారు, దానిలో భాగస్వాములైనవారు కఠిన శిక్షలు, భారీ జరిమానాలను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన చట్టసవరణ బిల్లు అయిన ‘పబ్లిక్ పరీక్షల (అనుచిత పద్ధతుల నివారణ) సవరణ బిల్లు 2026’కు లోక్‌సభ 2026, జులై 29న ఆమోదం తెలిపింది. నేరగాళ్లకు పదేళ్ల వరకు జైలుశిక్ష.. రూ.50 లక్షల జరిమానా, వ్యవస్థీకృత నేరాలకైతే రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేందుకు ఈ బిల్లులో ప్రతిపాదించారు. చర్చ తర్వాత ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభకు వెళ్లింది.