భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) నియామకాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించే విధానానికి కేంద్రం నాంది పలికిందని రక్షణ శాఖ పేర్కొంది. గతంలో కోస్ట్‌గార్డ్‌లో మహిళలకు అవకాశం కల్పించినా అది తాత్కాలిక నియామకాలకు మాత్రమే పరిమితమై ఉండేది. తాజాగా తీసుకొచ్చిన విధానపరమైన సంస్కరణ ఈ వివక్షను తొలగించింది. ఈ సంస్కరణలో భాగంగా సమగ్రమైన, మహిళా అనుకూలమైన విధానాన్ని ప్రభుత్వం చేపట్టిందని రక్షణ శాఖ వివరించింది.