బిహార్‌ సీఎంగా సమ్రాట్‌ ప్రమాణం

బిహార్‌ సీఎంగా సమ్రాట్‌ ప్రమాణం
  • బిహార్‌ 24వ ముఖ్యమంత్రిగా సమ్రాట్‌ చౌధరీ 2026, ఏప్రిల్‌ 15న ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చౌధరీతో గవర్నర్‌ సయ్యద్‌ అతా హస్నైన్‌ ప్రమాణం చేయించారు. జేడీ(యూ) నేతలు బిజేంద్ర కుమార్‌ యాదవ్, విజయ్‌ కుమార్‌ చౌధరీలు కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇద్దరికీ ఉపముఖ్యమంత్రి పదవులు దక్కాయి.
  • హోం, ఆరోగ్యశాఖ సహా కీలక 29 శాఖలను సీఎం చౌధరీ తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం విజయ్‌ కుమార్‌కు విద్యా, రవాణాతో పాటు 10 శాఖలను అప్పగించారు. బిజేంద్ర యాదవ్‌కు ఆర్థిక శాఖ సహా 8 శాఖలను కేటాయించినట్లు కేబినెట్‌ సచివాలయ విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram