78 మందికి శౌర్య పురస్కారాలు

78 మందికి శౌర్య పురస్కారాలు

విధి నిర్వహణలో అత్యుత్తమ ధైర్యసాహసాలను ప్రదర్శించిన త్రివిధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు 78 శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రకటించారు. దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రకటన చేశారు. వీరిలో 13 మంది మరణానంతరం ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ పురస్కారాల్లో 9 కీర్తి చక్ర, 19 శౌర్య చక్ర, ఒక బార్‌ టు శౌర్య చక్ర, ఐదు బార్‌ టు సేనా మెడల్స్‌ (సాహస), మూడు నౌ సేనా పతకాలు, ఐదు వాయుసేనా పతకాలు (సాహస) ఉన్నాయి. కీర్తి చక్ర అనేది శాంతి సమయంలో ఇచ్చే రెండో అత్యున్నత పతకం. శౌర్య చక్ర.. ఆ తర్వాతి వరుసలో నిలుస్తుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram