సంగీత నాటక అకాడమీ అవార్డులు

సంగీత నాటక అకాడమీ అవార్డులు

కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024, 2025 సంవత్సరాలకు ప్రకటించిన ఫెలోషిప్, పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఆగస్టు 13న దిల్లీలో ప్రదానం చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 11 మంది రాష్ట్రపతి నుంచి పురస్కారాలను స్వీకరించారు. సంగీతం, నాట్యం, నాటకం, జానపద రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న కళాకారులను కేంద్ర సంగీత నాటక అకాడమీ 1952 నుంచి ఈ అవార్డులతో సత్కరిస్తూ వస్తోంది. ఫెలోషిప్‌నకు ఎంపికైన వారికి రూ.3 లక్షలు, అకాడమీ పురస్కారాలకు ఎంపికైనవారికి రూ.లక్ష బహుమానం అందజేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram