చేనేత జాతీయ పురస్కారాలు

చేనేత జాతీయ పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్‌:

తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన ఇద్దరు, శ్రీకాకుళం గ్రామీణ మండలం అలికాం గ్రామానికి చెందిన ఒక చేనేత కళాకారుడికి జాతీయ పురస్కారాలు దక్కాయి. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని 2026, ఆగస్టు 7న దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో.. కేంద్ర చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చేతుల మీదుగా వీరు వాటిని అందుకున్నారు. వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు, బంగారుపేటకు చెందిన చింతం రంగరాజ్‌ వీవర్స్‌ వెల్ఫేర్‌ స్కీమ్‌ ద్వారా జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు.

  • శ్రీకాకుళం గ్రామీణ మండలం అలికాం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు మురకల నటరాజ్‌.. తన తండ్రి మల్లేష్‌ నుంచి వారసత్వంగా వచ్చిన టస్సర్‌ చీరల నేతలో 13 ఏళ్లుగా చూపుతున్న ప్రతిభ, సామర్థ్యాలకు గుర్తింపుగా రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.

తెలంగాణ:

  • రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన చేనేత కళాకారుడు గంజి వెంకటేశ్‌ జాతీయ చేనేత పురస్కారాన్ని ఆగస్టు 7న అందుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ‘సంత్‌కబీర్‌ హస్తకళా’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఈయనొక్కరే తన కళా నైపుణ్యంతో జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram